అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టిఅన్నారం ఇందుఅరణ్యలోని భూపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలోనూ తనిఖీలు నిర్వహించింది. రూ.5.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించి సీజ్ చేసింది.
కాగా, ఈ ఏడాది ఆగస్టు 13న ఓ ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి భూపాల్ రెడ్డి చిక్కారు. ఆయన అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.