లంచం తీసుకుంటూ దొరికిన గచ్చిబౌలి కరెంట్ అధికారి

లంచం తీసుకుంటూ దొరికిన గచ్చిబౌలి కరెంట్ అధికారి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీష్ కుమార్ రూ.70 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‎గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ఏసీబీ ఆఫీసర్స్ తనిఖీలు కొనసాగిస్తున్నారు. కాగా, ఓ పని కోసం వచ్చిన వ్యక్తిని ఏడీఈ సతీష్ కుమార్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 

ఈ క్రమంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 14) పక్కా ప్లానింగ్ ప్రకారం సతీష్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు. లంచగొండి అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. లంచం అనే మాట వినబడితే చాలు వెంటనే అక్కడ వాలిపోయి.. లంచం తీసుకుంటున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఏసీబీ దూకుడు అధికారులు లంచాలు తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. 

ALSO READ | కేసీఆర్, రేవంత్ ఇద్దరు కలిసి రండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్