
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సోదాల్లో రూ.5 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
ఆగస్టు 13న 8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి.భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలతో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.
ALSO READ | Hyderabad: సీఆర్పీఎఫ్ స్కూల్ కు బాంబ్ బెదిరింపు..
ఈ సోదాల్లో 5 కోట్ల5 లక్షల71వేల676 రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించారు అధికారులు. అయితే 4కోట్ల19లక్షల విలువైన ఆస్తులు .. బినామీల పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు.