మాజీ పంచాయితీ అధికారి ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

శంషాబాద్ మండల మాజీ పంచాయతీ ఆఫీసర్ సురేందర్ రెడ్డి ఇంట్లో  సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. సురేందర్ రెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కోటి రూపాయల ఖరీదు చేసే విల్లా గుర్తింపు.. 43లక్షల 79వేల విలువ చేసే 4 ఓపెన్ ప్లాట్లు, 8లక్షల విలువ చేసే రెండు వ్యవసాయ భూములు ఉన్నాయని తేల్చారు. 10 లక్షల 88 వేల విలువ చేసే 60.25 తులాల బంగారం సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లలో 51లక్షల 52వేల విలువ చేసే 129.2 తులాల గోల్డ్ ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 4లక్షల 22వేల 5వందల నగదును సీజ్ చేశారు. వీటన్నింటి విలువ  కోటి 18లక్షల 53వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సురేందర్ రెడ్డి పదేళ్లుగా శంషాబాద్ మండల పంచాయతీ ఆఫీసర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది.