హైదారాబాద్: రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు. ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ దొరికిన ఇద్దరు ఏఈలు, ఈఈ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం 5గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు దాదాపు 13గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ రైడ్స్ లో ఏసీబీ డీఎస్పీ శ్రీదర్ అధ్వర్యంలో 20 మందికి పైగా అధికారులు పాల్గోన్నారు.
కార్య నిర్వహణ అధికారి కె .బాన్సిలల్ (EE), ఇద్దరు AE లు నికేశ్ కార్తిక్ లని ఏసీబీ అధికారులు విచారించారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాలుగో అధికారి గురించి తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయాలనికి తరలించారు. వారిని అక్కడే విచారిస్తున్నారు.