హైదరాబాద్: కేటీఆర్కు బిగ్ షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. 2025, జనవరి 6వ తేదీ ఉదయం.. విచారణ కోసం ఏసీబీ ఆఫీస్ గేటు వరకు వచ్చి.. తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఏసీబీ అధికారులే నేరుగా.. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో భాగంగా.. హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కేటీఆర్ విల్లాలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు.
విచారణకు డుమ్మా కొట్టిన కేటీఆర్ ఇంటికి.. ఏసీబీ అధికారులు నేరుగా వెళ్లి విచారణ చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశాలకు తరలించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసు కంపెనీతో.. కేటీఆర్ కు లింకులు ఉన్నాయనేది రాజకీయం దుమారం రేపింది.