HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు... భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ లను విచారిస్తున్నారు. మేన అల్లుళ్లనే సైన్యంగా శివబాలకృష్ణ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ భరణిని HMDAలో కంప్యూటర్ ఆపరేటర్ గా పెట్టించాడు శివబాలకృష్ణ. అతడినే పీఏగా వాడుకున్నట్టు గుర్తించారు.
మరో బినామీ భరత్ ఎన్విస్ డిజైన్ స్టుడియో పేరుతో కన్సల్టెన్సీ నిర్వహించినట్లు తేల్చారు దర్యాప్తు అధికారులు. భరత్ కంపెనీ నుంచే శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ లే అవుట్ లకు పర్మిషన్ ఇచ్చేవారని గుర్తించారు. మరో బినామీ సోదరుడు నవీన్ కుమార్ శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు చూసేడేవాడని తేల్చారు.