మెడికల్​బిల్లులకు రూ.3 లక్షలు లంచం

  • నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లంచం డిమాండ్​

  • రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. 3 లక్షల రూపాయిలు  లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న అనే వ్యక్తి బిల్లులు చెల్లించేందుకు సూపరింటెండెంట్‌ను కలిశాడు. అందుకు మూడు లక్షలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు. 


ఇవాళ ( ఫిబ్రవరి 16)  ఉదయం లచ్చు నాయక్‌ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.