ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్ఐ

ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్ఐ
  • రైతు వద్ద స్టేషన్‌‌ బెయిల్‌ కు రూ.20 వేలు లంచం

 
వర్ని, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎస్‌‌ఐ రెడ్‌‌హ్యాండెడ్‌‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఐదు రోజుల కింద  రైతుశ్రీకాంత్‌‌, నాగరాజు అనే వాళ్లు గొడవపడ్డారు. శ్రీకాంత్‌‌ గాయపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజుపై 402 సెక్షన్‌‌ కింద ఎస్‌‌ఐ కృష్ణకుమార్‌‌ కేసు నమోదు చేశాడు.

మూడు రోజులుగా పీఎస్ కు రావాలంటూ అతడిపై ఒత్తిడి చేస్తుండగా.. స్టేషన్‌‌ బెయిల్​కు రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్​ఐ డిమాండ్‌‌ చేశాడు.  రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం వర్ని పీఎస్ లో నాగరాజు ఎస్‌‌ఐకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌‌గౌడ్‌‌ పట్టుకున్నారు. ఎస్‌‌ఐని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.