ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అందరికి గుర్తుండే ఉంటుంది. వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ చూడాలంటేనే అభిమానులకు విసుగొచ్చింది. మరి అంతరాయం కలిగినందుకే మనకు విసుగొచ్చిందంటే.. ఆ మ్యాచ్ జరగడం కోసం మైదాన సిబ్బంది ఎంతలా శ్రమించారో ఒక్కసారి ఆలోచించండి. ఈ మ్యాచ్ లో ఫలితం తేలిందంటే అందుకు కారణం.. గ్రౌండ్ సిబ్బందే.
వర్షం పడ్డ ప్రతిసారి వారు ఎంతో శ్రమించారు. నిమిషాల వ్యవధిలోనే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కవర్లపై నిలిచి ఉన్న నీటిని తొలగించడానికి వారు పడ్డ శ్రమ మాటల్లో చెప్పినంత తేలికైనది కాదు. ఎక్కడా నిరాశపడకుండా.. పదే పదే వారు గ్రౌండ్ క్లీన్ చేసిన దృశ్యాలు ఎంతోమందిని కదిలించాయి. వారి కష్టాన్ని, నిబద్ధతను గుర్తిస్తూ పలువురు వారిని అభినందించారు కూడాను. చివరికు వారి శ్రమకు తగిన ఫలితం అందింది.
Finally Groundsmen Of Sri Lanka taking rest after their hard work in the last few weeks.#INDvSL #INDvsSL #SLvsIND pic.twitter.com/hggFC0S9kR
— Abdullah Neaz ??? (@Abdullah__Neaz) September 17, 2023
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మరియు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ).. కొలంబో మరియు క్యాండీలో పనిచేసే క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్లకు భారీ నజరానా ప్రకటించాయి. 50వేల యూఎస్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 40 లక్షలు) వారికి అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జయ్‌షాట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వారి నిబద్ధత, కృషి వల్లే ఆసియా కప్ 2023 మరపురాని దృశ్యంగా మారిందని ట్వీట్ చేశారు.
Also Read :- Asia Cup 2023: అందనంత ఎత్తుతో భారత్.. దరిదాపుల్లో కనిపించని పాకిస్తాన్
??️ Big Shoutout to the Unsung Heroes of Cricket! ?
— Jay Shah (@JayShah) September 17, 2023
The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. ?
Their unwavering commitment and…
Picture of the Asia Cup.
— Johns. (@CricCrazyJohns) September 17, 2023
The Sri Lankan ground staff with the Prize money.
The heroes of this tournament. pic.twitter.com/mOFhd3THHa