క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై19న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై19న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో టీమిండియా సెమీస్‌లోకి ఎంటరైంది. సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత ఏ జట్టు.. సెమీస్‌కి అర్హత సాధించింది. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచులో పాకిస్తాన్ ఏ జట్టుతో తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 167 పరుగులు చేయగా, భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించారు. నేపాల్ నిర్ధేసించిన 167 పరుగుల లక్ష్యాన్ని.. 167 బంతులు మిగిలివుండగానే చేధించారు. ఓపెనర్లు సాయి సుదర్శన్(58), అభిషేక్ శర్మ(87) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మరోవైపు యూఏఈతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ఏ జట్టు 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట 309 పరుగులు చేసిన పాక్.. అనంతరం యూఏఈని 125 పరుగులకే కట్టడి చేసింది. 

బుధవారం ఇండియా- పాక్ మ్యాచ్

దాయాది దేశాలు తలపడతుండటం టోర్నీకే ఊపు తెచ్చింది. ఇరు జట్ల మధ్య జూలై 19న కొలంబో వేదికగా చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో టీమిండియా సమంగా ఉండగా.. పాక్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. షానవాజ్ దహని, మహమ్మద్ వసీం, కాసిం అక్రం త్రయం.. ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నారు. ఈ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో వారే ఛాంపియన్‌గా నిలిచే అవకాశం లేకపోలేదు.