కుర్రాళ్ల సమరం: నేటి నుంచి అండర్-19 ఆసియా కప్..టోర్నీ పూర్తి వివరాలు ఇవే

కుర్రాళ్ల సమరం: నేటి నుంచి అండర్-19 ఆసియా కప్..టోర్నీ పూర్తి వివరాలు ఇవే

అండర్-19 ఆసియా కప్ దుబాయ్ వేదికగా నేడు(డిసెంబర్ 8) ప్రారంభం కానుంది. మొత్తం 8 ఆసియా జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. గ్రూప్-ఏ లో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్, పాకిస్థాన్‌ ఉన్నాయి. మరోవైపు గ్రూప్-బి లో బంగ్లాదేశ్, జపాన్, శ్రీలంక,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలబడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.
 
ఈ టోర్నీ లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఓ వైపు భారత్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. మరో మ్యాచ్ లో   పాకిస్థాన్, నేపాల్ ఢీ కొంటాయి.  మ్యాచ్ లన్నీ దుబాయి వేదికగా జరుగుతాయి. డిసెంబర్ 17 న ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఉదయం 11 గంటల నుంచి (IST) మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఇండియా స్క్వాడ్ 

ఉదయ్ సహారన్ (సి), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ, ఆరవెల్లి అవనీష్ రావు, సౌమ్య్ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ గౌడ మహాజన్

ఆఫ్ఘనిస్తాన్ U19

నసీర్ ఖాన్ (సి), వఫివుల్లా తారఖిల్, జంషీద్ జద్రాన్, ఖలీద్ తనివాల్, అక్రమ్ మొహమ్మద్‌జాయ్, సోహైల్ ఖాన్ జుర్మతి, రహీముల్లా జుర్మతి, నోమన్ షా అఘా, మహ్మద్ యూనస్ జద్రాన్, అల్లా మహ్మద్ గజన్‌ఫర్, వహిదుల్లాహ్ జద్రాన్, బషీర్ అఫ్ఘాల్ అఫ్ఘాల్