అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం(డిసెంబర్ 06) శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో యువ భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత లంకను 173 పరుగులకే కట్టడి చేసిన భారత కుర్రాళ్లు.. అనంతరం ఆ లక్ష్యాన్ని 21.4 ఓవర్లలోనే చేధించారు.
ఐపీఎల్ వేలంలో కోటి 10 లక్షలు ధర పలికి అందరిని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. ఆ ధరకు తాను సరితూగగలనని నిరూపించాడు. లంక బౌలర్లపై విరుచుకు పడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 36 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. సూర్యవంశీ దెబ్బకు టీమిండియా తొలి 10 ఓవర్లలోనే 107 పరుగులు చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏకపక్షంగా మ్యాచ్ ముగిసింది. సూర్యవంశీ(67), ఆయుష్ మాత్రే(34), ఆండ్రీ సిద్దార్థ్(22), మహ్మద్ అమన్ (25) పరుగులు చేశారు.
Also Read:-రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి..
VAIBHAV SURYAVANSHI STORM!!
— Sports Culture (@SportsCulture24) December 6, 2024
-Smashed 31 runs in a single over!
-Scored 50* in just 24 balls.
-6 Fours and 4 Sixes. pic.twitter.com/OVqSlBEj95
లంక విలవిల
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక 173 పరుగులకే కుప్పకూలింది. లక్విన్ అబేసింగ్(69), షణ్ముగనాథన్(42) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3, కిరణ్ చోర్మలే 2, ఆయుష్ మాత్రే 2 వికెట్లు పడగొట్టారు.