దుబాయ్: మెన్స్‌అండర్19 టీమ్స్ ఆసియా కప్ ఈ నెల 29 నుంచి జరగనుంది. యూఏఈలోని షార్జా, దుబాయ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శుక్రవారం ప్రకటించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్ పోటీ పడనుంది. తర్వాతి రోజు (ఈ నెల 30) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఇండియా తన పోరు ఆరంభించనుంది.
ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు 2023 మెన్స్‌అండర్19 ప్రీమియర్ కప్‌లో టాప్–3లో నిలిచిన నేపాల్, జపాన్, యూఏఈ రెండు గ్రూపుల్లో బరిలోకి దిగుతాయి. గ్రూప్‌దశలో టాప్2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. డిసెంబర్ 6న సెమీఫైనల్స్, 8న ఫైనల్ జరుగుతాయి. ఇప్పటిదాకా జరిగిన పది ఎడిషన్లలో ఇండియా ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. గత సీజన్‌లో మాత్రం విన్నర్ బంగ్లాదేశ్ చేతిలో సెమీఫైనల్లోనే ఓడిపోయింది.