
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ సిటీలో అమృత్ 2.0 స్కీమ్ కింద మంజూరైన రూ.400 కోట్ల పనులను వేగవంతం చేయాలని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ సూచించారు. గురువారం కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మౌలిక వసతుల కోసం మంజూరైన ప్రతి పైసాను సద్వినియోగం చేయాలని, ఎండాకాలం తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ప్లాన్‌తో పని చేయాలన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలని నగరపాలిక పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలైతే మరింత డెవలప్మెంట్కు ఆస్కారం ఉందన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నుడా చైర్మన్ కేశవేణు, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్అండ్బీ, పీఆర్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ శాఖల ఆఫీసర్లు ఉన్నారు. తరువాత ఎమ్మెల్యే ధన్‌పాల్‌తో కలిసి 565 మంది లబ్ధిదారులకు రూ.5.65 కోట్ల విలువ గల షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఉద్యోగుల ప్రయోజనాన్ని కాపాడుతాం..
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెలా ఫస్ట్‌కే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ అన్నారు. ఉద్యోగుల ప్రతి ప్రయోజనాన్ని కాంగ్రెస్ సర్కార్ కాపాడుతుందన్నారు. టీఎన్జీవో యూనియన్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. గెజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్‌కు ల్యాండ్ కేటాయించామని నిర్మాణ పనులకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సమావేశంలో గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస్‌రావు, సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా ప్రెసిడెంట్ ఆలుక కిషన్, కార్యదర్శి అమృత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో యూనియన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు.