AI సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించిన గూగుల్ క్లౌడ్, యాక్సెంచర్

AI సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించిన గూగుల్ క్లౌడ్, యాక్సెంచర్

యాక్సెంచర్, Google క్లౌడ్ తమ వ్యాపారం అభివృద్ధిలో భాగంగా జాయింట్ జనరేటివ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (CoE) ని గురువారం ( డిసెంబర్14) ప్రారంభిం చాయి. ఈ సెంటర్ ప్రారంభం ద్వారా వ్యాపార వృద్ధి, కొత్త బిజినెస్ ను రూపొందించడం,ఉత్పాదక AIని ఉపయోగించి కస్టమర్స్ అనుభవాలను  రూపొందించడం వంటి కార్యక్రమాల్లో ముందడగు వేశాయి. ఇది Google క్లౌడ్ ఉత్పాదక AI పోర్ట్ పోలియోను ఉపయోగించి అప్లికేషన్లను రూపొందించడానికి స్కేల్ చేయడానికి పరిశ్రమ స్కిల్స్, సాంకేతిక పరిజ్షానం, ఉత్పత్తి వనరులను వ్యాపారులకు అందిస్తుంది. 

ఉత్పాదక AI తో తమ వ్యాపారాలు పునరుద్దరించడం, కొత్త వ్యాపారాలను వృద్ధి చేయడంలో అవకాశాలను అన్ లాక్ చేయడం వంటి  విషయాల్లో సంస్థలకు సాయపడే యాక్సెంచర్, Googel  క్లౌడ్ చేస్తున్న కృషిలో ఇది తాజా దశ. కొత్త సీఓఈ యాక్సెంచర్ కు సంబంధించిన డీప్ మోడల్ సేవలు,పూర్తిస్థాయి స్టాక్ ఇంజనీరింగ్ సేవలు,  Google  క్లౌడ్ కు చెందని అధునాతన ఉత్పాదక AI సాంకేతికతతో మిళితం చేసి క్లయింట్లకు వీటిని అందిస్తుంది. 

AI మోడల్ ఆప్టిమైజేషన్, ఫైన్ ట్యూనింగ్, ఫౌండేషన్ మోడల్ కోసం లేటెస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి యాక్సెంచర్ డేటా , AI అర్కిటెక్ట్స్ ఇంజనీర్లకుప్రత్యేకమైనయాక్సెస్ అందిస్తాయి. క్లయింట్లకు ఉత్పాదక AIతో వ్యాపార ఫలితాలను వేగంగా సాధించేందుకు అసవరమైన ప్రత్యేక వనరులను అందిస్తుంది.

జెమినీ, వెర్టెక్స్ AI లో మోడల్ గార్డెన్ ద్వారా 130 కంటే ఎక్కువ మోడల్ లతో సహా పెద్ద భాషా నమూనాల (LLM)  విస్తృతంగా ఎంపిక చేసుకోవడంలో LoE  సహాయ పడుతుంది. 

ఎంటర్ ప్రైజెస్ కార్యకలాపాలు, కంపెనీ కొత్త వ్యాపారం సామర్థ్యాలను జంప్ స్టార్ట చేయడానికి ఉత్పాదకAI అప్లికేషన్ అభివృద్ధి, విస్తరణ వేగవంతం చేయడానికి Google క్లౌడ్  వేగవంతమైన ప్రోటో టైపింగ్ సేవలు తోడ్పడతాయి. 

డెవలపర్ల కోసం డ్యూయెట్ AI ని ఉపయోగించడం ద్వారా కస్టమర్లకోసం  కోడ్ ఉత్పత్తిని  మద్దతునిస్తుంది. 

విభిన్న పరిశ్రమలోని సంస్థలు తమ సంస్థకార్యకలాపాల్లో జెన్ AIశక్తిని స్కేల్ చేయడానికి  ప్రయత్నిస్తున్నందుకు యాక్సెంచర్, Google క్లౌడ్ CoEకీలకమైన  దశకు చేరుకున్నాయి. ఉదా.. ఆరోగ్య భీమా ప్రొవైడర్ ఇండిపెండెన్స్  బ్లూ క్రాస్ వ్యాపార విలువను పెంచడానికి అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి చరిత్రను కలిగి ఉంది.