ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రజల హక్కులు,అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఢిల్లీ కాలుష్యం,ధరల పెరుగుదల, అవినీతిపై తమ పోరాటం కొనసాగుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మద్దతుగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా.. ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ వరుసగా 2015, 2020 , 2025లో జరిగిన మూడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు.
ఢిల్లీలో ఆప్,కాంగ్రెస్ విడిగా పోటీచేయడం వల్లే ప్రతిపక్షాల ఓట్లు చీలి బీజేపీ గెలిచిందనే చర్చ కూడా జరుగుతోంది. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితం బీజేపీకి వ్యతిరేకంగా ఉండేదనే వాదన వినిపిస్తోంది.
दिल्ली का जनादेश हम विनम्रता से स्वीकार करते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) February 8, 2025
प्रदेश के सभी कांग्रेस कार्यकर्ताओं को उनके समर्पण और सभी मतदाताओं को उनके समर्थन के लिए दिल से धन्यवाद।
प्रदूषण, महंगाई और भ्रष्टाचार के विरुद्ध - दिल्ली की प्रगति और दिल्लीवासियों के अधिकारों की यह लड़ाई जारी रहेगी।