తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే...

డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ( జూన్​ 20)  ముగిసింది. మొత్తంగా 2 లక్షల 80 వేల  దరఖాస్తులొచ్చాయి.  గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్తగా దరఖాస్తు చేసేకున్నారని విద్యాశాఖాధికారులు ప్రకటించారు. జులై 17 నుంచి 31 వరకు DSC పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

వాస్తవానికి ఏప్రిల్​ 4 వతేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే  డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం జూన్​ 20 వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పెంచింది . తొలుత ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 4వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగుస్తుంది.
. ఇక జులై 17 నుంచి 31 ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు. తాజాగా టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో రాష్ట్రంలో 2 లక్షల 800మంది అభ్యర్థులు టీచర్​ పోస్టులకు పోటీపడుతున్నారు. 

 తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్‌లో అర్హత సాధించాలి. పైగా టెట్‌లో సాధించిన మార్కుల్లో డీఎస్సీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో ఈ ఏడాదికి టెట్‌ నిర్వహించకపోవడంతో డీఎస్సీ 2024కి దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన పడ్డారు. దీనిపై స్పందించిన సర్కార్ డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహణకు ప్రకటన వెలువరించింది.

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేష ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..... మొత్తం 11 వేల 062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2వేల629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6వేల508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 కొలవులు ఉన్నాయి. ఇక గతంలో దరరఖాస్తు చేసుకున్న వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.... ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. పోస్టుల సంఖ్య పెంపుతో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.