జనగామలో నామినేషన్ల స్వీకరణకు రెడీ

  •     ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు టైం
  •     ఈ నెల 10 లాస్ట్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌
  •     అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు

జనగామ/కాశీబుగ్గ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారభం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. జనగామ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌, స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, పాలకుర్తిలోని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లను గురువారం జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌.శివలింగయ్య పరిశీలించారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ బల్దియా ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చేసిన ఏర్పాట్లను రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ బాషా పరిశీలించారు. నామినేషన్లు వేసే టైంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంచి రోజుల్లో క్యాండిడేట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ను, హెల్ప్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు 100 మీటర్ల దూరంలోనే వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఆపేయాలని, క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. 

ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలి

వర్ధన్నపేట, వెలుగు : నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌వోలు, ఎన్నికల సిబ్బందితో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి మాట్లాడారు. నామినేషన్ సెంటర్ల  వద్ద 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉంటుందని చెప్పారు. అనంతరం వర్ధన్నపేట పట్టణంలోని ఫుస్కోస్ స్కూల్‌‌‌‌‌‌‌‌ పోలింగ్‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

పోలింగ్‌‌‌‌‌‌‌‌ శాతం పెంచేందుకు కార్యక్రమాలు

ములుగు, వెలుగు : పోలింగ్‌‌‌‌‌‌‌‌ శాతం పెరిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ములుగు రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, ఐటీడీ పీవో అంకిత్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. గురువారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ములుగు గట్టమ్మ వద్ద గల ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నామినేషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌ శాతం పెరిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే ములుగులో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌, సర్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ను అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ డీఎస్‌‌‌‌‌‌‌‌.వెంకన్న పరిశీలించారు. 

భద్రత కట్టుదిట్టం

జనగామ జిల్లాలో 2,300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ సీతారాం చెప్పారు. ఇప్పటికే రెండు కంపెనీల బార్డర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బలగాలు వచ్చాయని, మరో మూడు కంపెనీల వరకు రానున్నాయని తెలిపారు. ప్రతీ పోలింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రం వద్ద బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జవాన్లకు తోడుగా ఇద్దరు సివిల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఉంటారన్నారు.

జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 405 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. పాత కేసుల్లో ఉన్న వ్యక్తులను బైండోవర్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.\

ALSO READ : నల్గొండ బీజేపీలో తేలిన నాలుగు సీట్లు