నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆయా గ్రామాలను విజిట్ చేశారు. జనగామలోని కేంద్రాలను కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ సభలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం గ్యారంటీలను అర్హులైన ప్రజలకు అందించేందుకు కృషి చేస్తోందన్నారు.
ములుగులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ దరఖాస్తు సెంటర్లను తనిఖీ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర , వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆయా గ్రామాల్లో ప్రజాపాలన కేంద్రాలను సందర్శించి, దరఖాస్తులు స్వీకరించారు. పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , ములుగు జిల్లా మంగపేట మండలంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు.