రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా : ప్రధాని మోదీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోందన్నారు. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామన్నారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు..శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు.  శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారని.. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా మోదీ ఫైర్ అయ్యారు. 

శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నా అని మోదీ అన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4 న తెలుస్తుందన్నారు.  జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందని.. ప్రపంచలోని అతిపెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు. 

ALSO READ | లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పనైపోతుంది: మోదీ

మే 13న తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ 400 పార్ అంటున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందని.. జూన్ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలన్నారు. తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతోందని.. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.. వికసిత్‌ భారత్‌ కోసం ఓటు వేయబోతున్నారు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పనైపోతుందని మోదీ తెలిపారు.

బీఆర్ఎస్‌ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోదీని తిట్టడం ప్రారంభిస్తారని విమర్శించారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబపార్టీలే కారణమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే తనకు అంత శక్తి వస్తుందని -ప్రధాని మోదీ అన్నారు.