
అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట ఎంపీపీ శాంతాబాయి బుధవారం సాయంత్రం మహబూబ్ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలినట్లయింది. ఆమెతోపాటు రంగాపూర్ సర్పంచ్ లోకియా నాయక్ బల్మూరు మండలంలోని బాణాల, అనంతవరం, రామాజుపల్లి ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లమల్ల ప్రాంత వాసి ఉండడంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.