ప్రమాదానికి గురైన పెళ్లి వాహనం.. వధూవరులకు గాయాలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఘోర ప్రమాదం జరగింది. రుద్రారం గ్రామ సమీపంలోని ప్యాలెస్ హోటల్ దగ్గర మే 12వ తేదీ శుక్రవారం అర్థరాత్రి జాతీయ రహదారిపై ఓ పెళ్లి వాహనం (డీసీఎం) అగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలై పరిస్తితి విషమంగా మారింది. మృతులు సంగన్న గారి కిష్టమ్మ, ఏర్పుల రాములమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అయితే తాగిన మైకంలో డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఓ పెళ్లి రిసెప్షన్ విందుకు హాజరై తిరుగు ప్రయాణంలో డీసీఎం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వీరంతా చిట్కుల్ గ్రామానికి చెందిన సంగన్న గారి రామచంద్రయ్య కూతురు వివాహానికి వచ్చిన బంధువులుగా గుర్తించారు.  ప్రమాదానికి గురైన పెళ్లి బృందం వాహనంలో వధువరులతో పాటు పలువురికి గాయాలు అయ్యాయి.