తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చెట్టు ఢీకొట్టిన వాహనం బోల్తా పడటంతో పదిమంది భక్తులకు  గాయాలయ్యాయి. దర్శన అనంతరం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రమాదం కారణంగా ఏర్పడ్డ ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. 

క్షతగాత్రులను 108ద్వారా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన సమయంలో తేలికపాటి వర్షమ్ కురుస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ భక్తులు తమిళనాడుకు చెందినవారిగా సమాచారం. పదిమందికి స్వల్ప గాయాలు మినహా ప్రాణనష్టం ఏమీ జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.