ఆదిలాబాద్ లో యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

ఆదిలాబాద్ లో యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

అదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ మండలం కుమ్మరితండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నార్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. మృతుడు పెర్కగూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.