దారుణం : స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి

దారుణం : స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి

  హైదరాబాద్ లో దారుణం జరిగింది. హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది.  వివరాల్లోకి వెళితే.. ఓ తండ్రి తన కొడకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన రెండేళ్ల కూతురుతో కలిసి వెళ్లాడు. కొడుకును బస్సు ఎక్కించిన తర్వాత డ్రైవర్ వెంటనే బస్సు కదపడంతో చిన్న పాప బస్సు టైర్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.