హర్యానాలో యాక్సిడెంట్..ఎనిమిది మంది మృతి

హర్యానాలో యాక్సిడెంట్..ఎనిమిది మంది మృతి

చండీగఢ్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న వెహికల్.. రోడ్డు పక్కన ​ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. హర్యానాలోని జింద్ జిల్లాలో హిసార్ – చండీగఢ్ నేషనల్​హైవేపై బిధరానా గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది.  చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, 15 ఏండ్ల బాలుడు ఉన్నారు. భక్తులు కురుక్షేత్ర జిల్లా నుంచి రాజస్థాన్‌‌‌‌లోని గోగమేడి ఆలయానికి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ ​జరిగింది.