తమిళ స్టార్ హీరో సూర్యకి ప్రమాదం జరిగింది. ఆయన ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతోంది. ఇందులో భాగంగా యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో సూర్య కెమెరా ముందు పడిపోవడంతో ఆయన భుజానికి గాయమైంది.
దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు చిత్ర యూనిట్. అయితే డాక్టర్స్ ఏం చెప్పారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సూర్యకు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.