
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో ఆటో పై నుంచి ఇద్దరు భక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే.. కుటుంబ సభ్యులతో సహా కొండగట్టు అంజన్న దర్శించుకుని ఆటోల ఘాట్ రోడ్డు దిగుతున్నారు భక్తులు. కుదుపులకు ఆటో టాప్ పైన కూర్చున్న ఇద్దరు భక్తులు కింద పడిపోయారు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయాలైన ఇద్దరిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రేమ్ చంద్, సాయి కృష్ణ గా గుర్తించారు.