కూకట్ పల్లి పరిధిలోని కైతలాపూర్ లో రన్నింగ్ ఉన్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కైతాలపూర్ నుంచి మూసాపేట్ వెళ్తున్న ట్రావెల్స్ కు చెందిన షిఫ్ట్ డిజైర్ టూర్ కారు (TS17U1039) లో షార్ట్ సర్కూట్ కారణంగా మంటల అంటుకున్నాయి. గమనించిన కారు డ్రైవర్ , యజమాని సుధాకర్ అలర్ట్ అయి రోడ్డు పక్కకు నిలిపాడు. స్థానికులు స్పందించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది.
ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారు యజమాని సుధాకర్ నిజామాబాద్ జిల్లా పిట్లం ప్రాంతం నుంచి నగరానికి వచ్చా ట్రావెల్స్ లో వాహనాన్ని నడుపుతున్నాడు.. కారు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.