
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రూరల్ మండలం కోటకదిర గ్రామంలో బైక్‌పై వెళుతున్న వారిని లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ముగ్గరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతులు గ్రామంలో జరిగే ఓ శుభకార్యానికి వంట చేసేందుకు వస్తున్నట్లు సమాచారం. వారంతా సద్ధలగుండు గ్రామానికి చెందిన వంటవారుగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.