యాదాద్రి భువనగిరి జిల్లాలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాడ్ డెడ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి బై పాస్ రోడ్లు లో ఆగి ఉన్న లారీ ని ఓ కారు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ, చిన్నపాప అక్కడికక్కడే మృతి చెందారు. 

కారు డ్రైవింగ్ చేస్తున్న  భర్త కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలు కేసముద్రానికి చెందిన వారిగా గుర్తించారు. 

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. వేంగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కారు బ్యానెట్ లారీ కిందికి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో ముందు సీట్లలో కూర్చున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.