మాదాపూర్, వెలుగు : డ్యూటీ అయిపోయాక సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మాదాపూర్100 ఫీట్స్రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన గణేశ్(34) తన భార్య పార్వతితో కలిసి ఏడు నెలల కింద హైదరాబాద్‌కు వచ్చాడు. బోరబండ తులసినగర్ లో ఉంటూ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్కంపెనీ లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం నైట్ డ్యూటీకి వెళ్లాడు. శనివారం ఉదయం 7 గంటలకు సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా మాదాపూర్ 100 ఫీట్స్ రోడ్డులో వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎన్85ఏఆర్5657 నంబర్కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేశ్ స్పాట్లోనే చనిపోయాడు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
బైక్ అదుపు తప్పి యువకుడు..
హైదరాబాద్‌సిటీ: ఓవర్స్పీడ్కారణంగా బైక్అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. కిస్మత్‌పూర్‌కు చెందిన సాత్విక్(17), నిశాంక్(17) బైక్‌పై శనివారం సాయంత్రం బయటికి వెళ్లారు. పుప్పాలగూడ పరిధిలోని ఫిషర్మెన్హోటల్సమీపంలో ఓవర్స్పీడ్కారణంగా వీరి బైక్అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. బైక్‌నడుపుతున్న సాత్విక్ ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే చనిపోయాడు. నిశాంక్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నార్సింగి పోలీసులు కేసు ఫైల్‌చేశారు.