ట్యాంక్ బండ్పై యాక్సిడెంట్.. మహిళ మృతి

ట్యాంక్ బండ్పై యాక్సిడెంట్..  మహిళ మృతి

ముషీరాబాద్, వెలుగు: డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో ట్యాంక్​బండ్​వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన అంబీర్ మధుసూధన్ రావు, శారద (50) దంపతులు. 

ఆదివారం (April 29) రాత్రి బైక్​పై జేబీఎస్ నుంచి మెహిదీపట్నంలోని తమ కొడుకు వద్దకు బయలుదేరారు. ట్యాంక్ బండ్‌‌పైకి రాగానే, వెనుక నుంచి అశోక్ లేలాండ్ వాహనం ఢీకొని కిందపడ్డారు. ఈ ఘటనలో శారదకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షేక్ అష్రఫ్ అదుపులోకి తీసుకొని, పోలీసులు విచారిస్తున్నారు

 లారీని బైక్​ ఢీకొని మరొకరు.. 

జీడిమెట్ల: లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ బండమాదారానికి చెందిన జె.అనిల్​​ (27) ప్రైవేటు ​జాబ్ చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున దూలపల్లి నుంచి ఇంటికి బైక్​పై వస్తుండగా, మార్గమధ్యలో యూటర్న్​ తీసుకుంటున్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పేట్​బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.