తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన బస్సు ముందు భాగం

తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం (19 జనవరి) వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులో 7 వ మైలు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొంది.  బస్సు ముందు భాగం నజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరుపతి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. 

 ఆదివారం ఉదయం ఇదే ప్రాంతంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా ఆస్పత్రికి తరలించారు. 

 అంతకు ముందు బైకు స్కిడ్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. రోడ్డుపైన  ఆయిల్ లీకై రోడ్డుపైన పడటంతో స్కిడ్ అయ్యి  బైక్ ప్రమాదం జరిగింది. ఆదివారం జరిగిన వరుస ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.