- ఒక్క నల్గొండ జిల్లాలోనే 42
- 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలు
- 108కి రోజు పది వేల యాక్సిడెంట్ కాల్స్
‘‘రోజూ రోడ్లపై ఎన్నో బతుకులు తెల్లారిపోతున్నయ్. తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ (యాక్సిడెంట్) స్పాట్స్ జనం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. డిజైనింగ్ లోపాలున్న, సేఫ్టీ లేని రోడ్లపై హైస్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నయ్. రోడ్డు సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం నిత్యం యాక్సిడెంట్లకు కారణం అవుతోంది’’
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులకు భయాందోళలను కలిగిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకి వెళ్లిన్పటి నుంచి తిరిగి వచ్చే దాక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. రూల్స్ ప్రకారం వెళ్తున్నా కొన్ని సార్లు రోడ్డు యాక్సిడెంట్స్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు ఓవర్ స్పీడింగ్, డ్రంకెన్ డ్రైవ్, డిజైనింగ్ ఫెయిల్యూర్స్ ప్రధాన కారణాలు. గురువారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్స్‌లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కూడా ఈ కోవలోనిదే. ఇందులో తొమ్మిది మంది కూలీలు చనిపోయారు. ఇట్ల రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న బ్లాక్ స్పాట్స్ నిత్యం ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నయి.
సేఫ్టీ మెజర్స్ పై నిర్లక్ష్యం
ఐదు అంతకంటే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన ఏరియాను బ్లాక్‌స్పాట్‌గా నిర్ధారించారు. కిందటేడాది ఫిబ్రవరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 871కి పైగా బ్లాక్‌స్పాట్లు గుర్తించారు. ఇందులో 326 ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపాలు ఉన్నట్లు తేల్చారు. ఈ బ్లాక్‌స్పాట్స్‌లో యాక్సిడెంట్స్ నివారణ కోసం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ డేంజర్ స్పాట్స్‌లో సాధారణ సైన్‌బోర్డ్స్ మినహా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ డెవలప్ చేయలేదు. నేషనల్, స్టేట్ హైవేస్‌లోని టర్నింగ్స్, ఇరుకైన రోడ్లు, బ్రిడ్జిలపై రోడ్ల వెడల్పు చేయలేదు.
గతేడాది ప్రమాదాల్లో 6,231 మంది మృతి
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లలో ప్యాచ్‌వర్క్‌లు మాత్రమే చేస్తున్నారు. దీంతో గతుకుల రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నయి. గతేడాది నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా16,866 యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో 6,231 మంది ప్రాణాలు కోల్పోగా 16,591 మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు తగ్గడం లేదు. దీంతో ప్రతిరోజు యావరేజ్‌గా10వేలకు పైగా యాక్సిడెంట్స్ కాల్స్‌ను 108 సిబ్బంది రిసీవ్ చేసుకుంటున్నారు. వీటిలో సుమారు1,200లకు పైగా పెద్ద ప్రమాదాలు ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రతీ ఫ్యాటల్ యాక్సిడెంట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా సుమారు నలుగురు గాయపడుతున్నారు.
ప్రమాదాలు తగ్గించేందుకు ప్లాన్స్
ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ అథారిటీ ప్రస్తుతం నిర్వహిస్తున్న నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్‌లో అవగాహ కార్యక్రమాలు చేపట్టింది. పోలీసులు,ఆర్ అండ్ బీ, ఆర్టీఏ, మున్సిపల్ డిపార్ట్‌మెంట్లతో కలిసి బ్లాక్ స్పాట్స్‌పై ఫోకస్ చేయాలని నిర్ణయించింది. 22 రీజినల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. హైవే మొబైల్స్‌తో పాటు టీఎస్ కాప్ యాప్‌తో రోడ్ యాక్సిడెంట్స్ డేటాను కనెక్ట్ చేయనుంది. ఇందుకోసం వారం రోజుల్లోకి గైడ్‌లైన్స్ రూపొందించేలా ప్లాన్ చేసింది.
ప్రమాదాల్లో యూత్ ఎక్కువ చనిపోతున్నరు
“రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్గిస్తున్నం. ఫిబ్రవరి 17 వరకు రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహిస్తున్నాము. యాక్సిండెంట్స్‌లో యవత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతోంది. అందుకే యూత్‌లో ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ, ప్రమాదాలపై అవేర్నెస్ తెస్తున్నం. మా పరిధిలోని బ్లాక్ స్పాట్స్‌లో జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బీతో కలిసి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నం. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.’’
– అనిల్‌కుమార్, అడిషనల్ సీపీ, ట్రాఫిక్
For More News..