కేసీఆర్ కాన్వాయ్‌కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లోని 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.  ఈ ఘటనలో ఎవరకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ స్వల్పంగా వాహనాలు ధ్వంసమయ్యాయి.  కాగా మరికాసేపట్లో మిర్యాలగూడలో రోడ్ షో లో పాల్గొననున్నారు కేసీఆర్. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.