మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో ఒక కారు సడెన్ బ్రేక్ వేయడంతో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ దర్గా కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.
సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గాకు వెళ్తున్న క్రమంలో గరిడేపల్లి పీఎస్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఒక కారును మరో కారు వరుసగా 8 కార్లు ఢీకొన్నాయి. అయితే కారులో ఉన్న మంత్రి ఉత్తమ్ తోపాటు మిగతా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మంత్రి వస్తున్నట్లు సమాచారం అందుకున్న కార్యకర్తలు రోడ్డుపై ఎదురు చూస్తుండటంతో కారు ఆపమని మంత్రి ఉత్తమ్ కోరడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక ఉన్న కార్లు ఒకదానికకొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ కావడంతో.. మంత్రి వెళ్లిన తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.