
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొన్నాయి..ఈ ప్రమాదంలో రెండు కార్లు తుక్కు తుక్కు అయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర ఆదివారం (మార్చి2) ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్లగొండకు చెందిన సయ్యద్ నవాజ్, మహ్మద్ జుబైర్ గా గుర్తించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టడంతో కారు బస్సు కిందికి దూసుకుపోయింది. మరో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై అడ్డంగా వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.