
సిద్దిపేట రూరల్, వెలుగు: గుర్తు తెలియని వెహికల్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన ప్రకారం.. సిద్దిపేట టౌన్ కాళ్లకుంట కాలనీలో ఉండే దమ్మి శ్రీనివాస్(49) శనివారం రాత్రి తన కూతురు బాలమణిని తీసుకుని ఆమె అత్తగారి ఊరైన రాయపోల్ మండలం కొత్తపల్లికి వెళ్లి దింపాడు.
తన ఎక్సెల్ బండిపై తిరిగి సిద్దిపేటకు వస్తుండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డులో అర్ధరాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వెహికల్ అతడిని ఢీ కొట్టి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను 108లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. మృతుడి కొడుకు అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.