
- కాలిపోయిన నాలుగు కార్లు
నారాయణ్ ఖేడ్,వెలుగు: మారుతి ఓమ్ని వ్యాన్‌ను రిపేర్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల కారులోని సిలిండర్ పేలి నాలుగు కార్లు కాలిపోయాయి. నారాయణఖేడ్‌లోని మోహిద్ ఖాన్ కు చెందిన మెకానిక్ షెడ్లో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం, మోహిద్ ఖాన్ షెడ్లో బండిని రిపేర్ చేస్తుండగా బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయి వంద మీటర్ల దూరంలో పడింది. భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.