మునగాలలో మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవోలు

మునగాల, గరిడేపల్లి, వెలుగు: కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవోలు మీసేవ కేంద్రాలను తనిఖీ చేశారు. గురువారం  కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ మునగాల మండలంలోని మీ సేవ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, గరిడేపల్లి, గడ్డిపల్లి మీసేవ కేంద్రాలను హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తనిఖీ చేశారు.

ప్రభుత్వ నిర్దేశించిన చార్జీలు తీసుకుంటున్నారా..? ఎక్కువ వసూలు చేస్తున్నారా..? అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ చార్జీలు తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  వీరి వెంట తహసీల్దార్లు ఆంజనేయులు, కవితా రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.