
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరుతుండడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత ఆదివారం రాడిసన్ బ్లూ పబ్ లో దొరొకిన డ్రగ్స్ గురించి గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ అవినితిపై గవర్నర్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహంతో ఉన్నారు.
యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించిన తర్వాత దర్శానానికి వెళ్లిన గవర్నర్ పర్యటనకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా.. కాదు కదా.. కనీసం ఆలయ ఈవో కూడా హాజరుకాని ఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి రోజు రోజుకూ శృతి మించుతుండంతో సహించలేకపోయిన గవర్నర్ తమిళి సై ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోడీలతో అపాయింట్ మెంట్ తీసుకుని స్వయంగా కలసి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలను అవమానించారని... కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆమె ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్ కి ప్రోటాకాల్ ఇవ్వకపోటం ఎంటి ? నిజమేనా ? అంటూ అమిత్ షా ప్రశ్నంచి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సీఎస్కు హైకోర్టు నోటీసులు
60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు: జీవితమంతా కోర్టు మెట్లెక్కడమేనా..?
10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన బిల్ కలెక్టర్