క్రాప్ లోన్​ కట్టలేదని రైతుల అకౌంట్లు బ్లాక్ చేశారు

క్రాప్ లోన్​ కట్టలేదని రైతుల అకౌంట్లు బ్లాక్ చేశారు
  • క్రాప్ లోన్​ కట్టలేదని  అకౌంట్లు బ్లాక్ చేశారు
  • బ్యాంక్​ ఎదుట ధర్నాకు దిగిన రైతులు

శివ్వంపేట, వెలుగు: క్రాప్​ లోన్​ కట్టలేదనే కారణంతో తమ అకౌంట్లు బ్లాక్​ చేశారని పేర్కొంటూ మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం దొంతి ఆంధ్రా బ్యాంకు ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేశారు. క్రాప్  లోన్  కట్టలేదని తమ పెన్షన్   డబ్బులు ఇవ్వకుండా అకౌంట్​ హోల్డ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడిసిన్స్​ కొనుక్కోవడానికి డబ్బులు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. 

రుణమాఫీ కాగానే క్రాప్ లోన్​ క్లియర్  చేస్తామని చెప్పినా బ్యాంకు ఆఫీసర్లు వినడం లేదని వాపోయారు. క్రాప్  లోన్​ కడితేనే బ్యాంకు అకౌంట్​ నుంచి డబ్బులు తీసుకోవచ్చని చెబుతున్నారన్నారు. 30 మంది అకౌంట్లు హోల్డ్​లో పెట్టారని, క్రాప్  లోన్​ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే క్రాప్  లోన్​ మాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరారు.