నవాబుపేట, వెలుగు: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి జనాల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష్యుడు నీరటి రాంచంద్రయ్య విమర్శించారు.
ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మండలంలోని దేపల్లి ఉప సర్పంచ్ భర్త వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకుంటే బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సోదరుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను వేధించడం బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అని తెలిపారు. ఇలాంటి కుట్రలు చేయడంతోనే ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అజహర్అలీ, వెంకటేశ్‌గౌడ్, రామ్మోహన్ పాల్గొన్నారు.