కాగజ్ నగర్ లో మందుబాబులకు అడ్డాగా రైతు వేదికలు

కాగజ్ నగర్, వెలుగు: రైతులకు శిక్షణ ఇచ్చేందుకు లక్షలు ఖర్చుచేసి ఏర్పాటుచేసిన రైతు వేదిక భవనాలు మందు బాబులకు సిట్టింగ్ అడ్డాలుగా మారుతున్నాయి. కాగజ్ నగర్ డివిజన్ లోని మండలాల్లోని రైతు వేదికలు వారానికి ఒక్కసారి కూడా తెరుచుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఏఈఓలు నిర్లక్ష్యం వహిస్తూ రైతు వేదికలను ఓపెన్ చేయకపోవడంతో వాటిని మందుబాబులు సిట్టింగ్ ప్లేస్​గా వాడుకుంటున్నారు. సింటెక్సులను పగులగొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతు వేదికలపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.