బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

పంజాగుట్ట, వెలుగు: సనత్​నగర్​ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎస్సార్​నగర్  పోలీసులు అరెస్ట్ ​చేశారు. యూపీకి చెందిన షాబాద్ అనే యువకుడు సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫుడ్ సప్లయ్ విభాగంలో పనిచేస్తున్నాడు. తమ్ముడికి ట్రీట్ మెంట్ కోసం ఇటీవల కర్ణాటక నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చిన బాలిక (13)తో షాబాద్ పరిచయం పెంచుకున్నాడు.

ఈ నెల 15న బాలికకు మాయమాటలు చెప్పి రెండో అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేసిన పోలీసులు మంగళవారం షాబాద్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.