బాలిక రేప్ కేసులో వ్యక్తకి20ఏళ్ల జైలుశిక్ష

బాలిక రేప్ కేసులో వ్యక్తకి20ఏళ్ల జైలుశిక్ష

హైదరాబాద్: బాలికరేప్ కేసులో సంచలన తీర్పునిచ్చింది నాంపల్లి పొక్సో సెషన్స్ కోర్టు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20యేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. 2017లో హైదరాబాద్ లోని కాచిగూడ పరిధి రత్నానగర్ లో నివాసముంటున్న మల్పరాజుల ప్రవీణ్ (28) ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రవీన్ పై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

పూర్తి విచారణ అనంతరం మంగళవారం ఈ కేసులో నాంపల్లి పొక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి పుష్పలత .. ప్రవీణ్ కు 20యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించింది. నిందితుడు ప్రవీణ్ ను జైలుకు తరలించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.