నిజామాబాద్, వెలుగు: డిచ్పల్లి పోలీసుల కస్టడీలోని నిందితుడు మంగళవారం ఉదయం పారిపోయాడు. బాత్రూం కిటికీ రాడ్‌ను పక్కకు వంచి జారుకున్నాడు. బయట కాపలా ఉన్న కానిస్టేబుల్గమనించేలోపు పారిపోయాడు. ఈ నెల 4న నిజామాబాద్రూరల్సెగ్మెంట్జక్రాన్పల్లి మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్జరిగింది. బీడీలు చుట్టే స్వర్ణ అనే మహిళ వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలోని గోల్డ్ చైన్‌ను లాక్కెళ్లారు.
ఇందిరమ్మ కాలనీలోని మరో మహిళ వద్ద ఇలాగే లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మహ్మద్సోహెల్, ఇమ్రాన్అనే ఇద్దరు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని డిచ్పల్లి పీఎస్‌కు తరలించారు. అయితే నిందితుల్లో ఒకరైన మహ్మద్ సోహెల్మంగళవారం బాత్రూమ్కిటికీ రాడ్వంచి పరారయ్యాడు. స్టేషన్‌కు కంపౌండ్ వాల్ లేకపోవడంతో ఫెన్సింగ్కిందగా జారుకున్నాడు. సీపీ కల్మేశ్వర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఏసీపీ కిరణ్‌కుమార్ స్టేషన్‌ను విజిట్చేశారు. స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దింపారు.