శాంతినగర్, వెలుగు: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లో కిరాణా వ్యాపారి రమేశ్ శెట్టి కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శాంతినగర్ సీఐ టాటా బాబు తెలిపారు.
డబ్బులు ఇస్తామని పిలిపించి కిడ్నాప్ చేయగా, ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుల చెర నుంచి రమేశ్ శెట్టిని విడిపించగా, కిడ్నాప్ చేసిన భూపాల్, సత్యనారాయణ, మహ్మద్ అలీ, సతీశ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.50 వేల నగదు, 7 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చెప్పారు. ఎస్ఐ సంతోష్, పోలీసులు పాల్గొన్నారు.